బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (12:59 IST)

పొట్లకాయ తింటే షుగర్ శాతాన్ని...

పొట్లకాయను తరచూ కూరల్లో ఉపయోగిస్తుంటారు. పొట్లకాయను కొంతమంది బాగా ఇష్టపడుతారు. పొట్లకాయలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. పొట్లకాయలో శరీరానికి కావలసిన ఫైబర్, విటమిన్ ఎ, బి, సి, క్యాల్షియం,

పొట్లకాయను తరచూ కూరల్లో ఉపయోగిస్తుంటారు. పొట్లకాయను కొంతమంది బాగా ఇష్టపడుతారు. పొట్లకాయలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. పొట్లకాయలో శరీరానికి కావలసిన ఫైబర్, విటమిన్ ఎ, బి, సి, క్యాల్షియం, ఐరన్, పొటాషియ, మెగ్నిషియం, జింక్ పుష్కలంగా దొరుకుతాయి. షుగర్ వ్యాధిని నియంత్రించుటలో ఇది ఒక మంచి ఔషధం. 
 
పొట్లకాయలో క్యాలరీలు తక్కువగా ఉండడం వలన దీనిని జ్యూస్‌గా తీసుకుంటే షుగర్ శాతాన్ని తగ్గించవచ్చును. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుటలో చాలా ఉపయోగపడుతుంది. పొట్లకాయను తీసుకుంటే శరీరంలోని వేడిన తగ్గించేందుకు దోహదపడుతుంది. విటమిన్ సి పొల్లకాయలో యాంటీ యాక్సిడెంట్‌లుగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు సమస్యను అదుపులోకి ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.