ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 11 జులై 2018 (10:59 IST)

జామ ఆకులతో టీ త్రాగితే? శ్వాసకోశ సమస్యలు?

జామపండే కాదు జామ చెట్టు ఆకులు కూడా మన ఆరోగ్య విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యమైన జుట్టుకు జామఆకులు ఎంతో శ్రేష్ఠమని నిపుణులు సూచిస్తున్నారు. జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. ఈ ఆకులు నీటిలో

జామపండే కాదు జామ చెట్టు ఆకులు కూడా మన ఆరోగ్య విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యమైన జుట్టుకు జామఆకులు ఎంతో శ్రేష్ఠమని నిపుణులు సూచిస్తున్నారు. జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. ఈ ఆకులు నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది. అంతేకాకుండా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.
 
జామ ఆకుల్ని తీసుకోవడం వలన దంతాలకు ఆరోగ్యం. నోటీలోని చెడు బ్యాక్టీరియాలని నశిస్తుంది. ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా ఈ జామ ఆకులు నియంత్రిస్తాయి. జామ ఆకులతో చేసిన టీ తాగడం వలన శ్వాసకోశ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి.
 
ఈ ఆకుల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్స్ చర్మ సౌందర్యానికి చాలా మంచివి.