శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (11:51 IST)

పాలకూర సూప్‌తో.. అజీర్తి సమస్య చెక్..

కొందరైతే ఏది దొరికితే అది తినేస్తుంటారు. దాంతో అజీర్తి సమస్యతో బాధపడుతుంటారు. ఇంకా చెప్పాలంటే మరికొందరు ఏది తిన్నా కూడా జీర్ణం కాదు. ఈ సమస్యను తొలగించుకోవడానికి రకరకాల మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించదు. కనుక ఫైబర్ అధికంగా గల ఆహార పదార్థాలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం..
 
పచ్చి బఠానీలు, బీన్స్ వంటి కూరగాయలల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని ఎలా తీసుకోవాలంటే పచ్చి బఠానీలను నానబెట్టి ఉడికించుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి సమస్య తగ్గుతుంది. బీన్స్‌ను కూర రూపంలో కంటే వేపుడుగా తీసుకుంటే వాటిలోని విటమిన్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. 
 
క్యారెట్స్‌లో శరీరానికి కావలసినంత ఫైబర్ లభిస్తుంది. 100 గ్రాముల క్యారెట్స్‌లో 2.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్యారెట్స్‌ను పచ్చిగా తీసుకుంటే మంచిది. అలానే పాలకూర, దీనిలోని విటమిన్ ఎ, బి, సి, కె, మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అజీర్తిని తొలగిస్తాయి. 
 
పాలకూరను కూరగా తీసుకునేందుకు చిన్నారులు, పెద్దలు అందగా ఇష్టపడరు. అందువలన దీనిని సూప్‌గా తయారుచేసుకుని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి పాలకూర సూప్ ఎలా చేయాలో చూద్దాం.. పాలకూరను ఉడికించుకుని ఆ రసంలో కొద్దిగా ఉప్పు, కూరగాయలు వేసుకుని సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.