ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (14:01 IST)

క్యారెట్ సూప్ ఎలా చేయాలో తెలుసా?

క్యారెట్స్‌లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఆకలిని పెంచుటకు క్యారెట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపునొప్పికి సంబంధించిన ఆంత్రమార్గం యొక్క కండరాలను సరిచేస్తు

క్యారెట్స్‌లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఆకలిని పెంచుటకు క్యారెట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపునొప్పికి సంబంధించిన ఆంత్రమార్గం యొక్క కండరాలను సరిచేస్తుంది. పక్షవాతం వంటి బలహీనమైన కండరాల పరిస్థితిని చక్కబరుస్తుంది. ఇటువంటి క్యారెట్‌తో సూప్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
క్యారెట్‌ - 1 కప్పు 
పొట్టు పెసరపప్పు - అరకప్పు 
మిరియాలు - 6 
ఉల్లి తరుగు - పావు కప్పు 
వెల్లుల్లి తరుగు - 1  స్పూన్ 
టమోటా తరుగు - పావు కప్పు 
పాలు - ముప్పావు కప్పు 
నూనె - 1 స్పూన్ 
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా నూనెలో మిరియాలు, ఉల్లి, వెల్లుల్లి తరుగులను 3 నిమిషాలు వేగించాలి. ఆ తరువాత క్యారెట్‌, టమోటా ముక్కలను ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. 4 నిమిషాల తరువాత పెసరపప్పుతో పాటు ఒక కప్పు నీరు పోసి క్యారెట్‌ ముక్కలు మెత్తబడేవరకు చిన్నమంటపై ఉడికించుకోవాలి. మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో పాలతో పాటు ఒకటిన్నర కప్పు నీరు, ఉప్పు, మిరియాలపొడి కలిపి మరికొద్దిసేపు మరిగించాలి. చివరగా బ్రెడ్‌ క్యూబ్స్‌ వేసుకుని తీసుకుంటే వేడి వేడి క్యారెట్ సూప్ రెడీ.