1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:07 IST)

పెసర మెులకలతో పకోడీలా... ఎలా చేయాలో చూద్దాం...

జీర్ణశక్తికి పెంచుటకు మెులకలు చక్కగా పనిచేస్తాయి. వీటి వలన ఎంజైముల పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గించుటకు మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక బరువును తగ్గించుటకు సహాయపడుతాయి. ఇటువంటి పెసర మె

జీర్ణశక్తికి పెంచుటకు మెులకలు చక్కగా పనిచేస్తాయి. వీటి వలన ఎంజైముల పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గించుటకు మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక బరువును తగ్గించుటకు సహాయపడుతాయి. ఇటువంటి పెసర మెులకలతో పకోడీలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు: 
పెసర మెులకలు - పావు కప్పు
వరిపిండి - 2 స్పూన్స్
పుదీనా తరుగు - కొద్దిగా
వెల్లుల్లి పేస్ట్ -  1 స్పూన్
అల్లం పేస్ట్ - అర స్పూన్ 
పచ్చిమిర్చి పేస్ట్ - అర స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా మెులకల్ని మిక్సీలో పిండిలా రుబ్బుకోవాలి. ఈ పిండిలో పైన తెలిపిన పదార్థాలన్నింటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆ పిండిని పకోడీల్లా నూనెలో వేసుకుని ఎర్రని రంగు మారేంతవరకు వేయించుకోవాలి. అంతే... వేడివేడి పకోడీలు రెడీ.