శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 9 డిశెంబరు 2017 (22:00 IST)

ఇవి పాటిస్తే.. అనారోగ్యమనేది దరిచేరదు..

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఆరోగ్యానికి మూలం మన రోగనిరోధక వ్యవస్థ. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోనివారు, పొగత్రాగేవారు, మత్తుపానీయాల అలవాటు ఉన్నవారు విటమిన్ లోప

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఆరోగ్యానికి మూలం మన రోగనిరోధక వ్యవస్థ. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోనివారు, పొగత్రాగేవారు, మత్తుపానీయాల అలవాటు ఉన్నవారు విటమిన్ లోపం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సమపాళ్ళలో పోషక పదార్థాలను శరీరానికి అందించాలి. అందులో ఒక్కొక్క పదార్థానికి ఒక విశిష్ట గుణముంది. 
 
మామిడి, బత్తాయి వంటి పండ్ల ద్వారా ఎ-విటమిన్, నిమ్మ, ఉసిరి వంటి వాటి ద్వారా విటమిన్ - సి, కోడిగుడ్ల ద్వారా జింక్, ఐరన్, బాదం, కిస్‌మిస్ వంటి ద్వారా మేలు చేసే క్రొవ్వులు, చేపల ద్వారా ఇతర పోషకాలు శరీరానికి అందగలవు. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు, పెరుగు తీసుకోవాలి. వెల్లుల్లికి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడే శక్తి ఉంది. మాంసం తింటే బాక్టీరియాతో వచ్చే వ్యాధులు అరికడుతుంది. కాబట్టి జంక్ ఫుండ్ వంటి వాటిని తీసుకొని అనారోగ్యాన్ని కొనితెచ్చికోకూడదు.