శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (14:03 IST)

గ్రీన్ టీ బ్యాగులతో నల్లటి వలయాలు మాయం (video)

గ్రీన్ టీ బ్యాగులతో కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్, గ్రీన్ టీ బ్యాగులను అరగంట పాటు ఫ్రిజ్‌లో వుంచాలి. ఆపై వాటిని తీసి ఒక్కో కంటిమీద పది నుంచి 20 నిమిషాల పాటు వుంచాలి. ఆ తర్వాత ముఖాన్ని శు

గ్రీన్ టీ బ్యాగులతో కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్, గ్రీన్ టీ బ్యాగులను అరగంట పాటు ఫ్రిజ్‌లో వుంచాలి. ఆపై వాటిని తీసి ఒక్కో కంటిమీద పది నుంచి 20 నిమిషాల పాటు వుంచాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఇలా రెండు మూడుసార్లు చేస్తే వలయాలు తొలగిపోతాయి.
 
అలాగే కీరదోస ముక్కలు, పొటాటో ముక్కలను కూడా కంటి కిందనున్న వలయాల వద్ద అరగంట వుంచితే వాటిని తొలగించుకోవచ్చు. పుదీనా ఆకులను పేస్ట్ చేసి.. అందులో నిమ్మరం కలిపి కళ్ల కింద రాసి అర గంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
కాటన్‌తో చల్లని నీళ్లు లేదా పాలను తడిపి.. దాన్ని కంటిమీద వత్తి తీసేస్తూ వుండాలి. ఆ కాటన్‌ కళ్లపై కాసేపు అలానే వుంచాలి. తర్వాత ఐస్‌క్యూబ్స్ పెట్టి కాసేపు మర్దన చేయాలి. తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే కంటి కింద వలయాలు మాయమవుతాయి. కీరదోస రసం, నిమ్మరసం, టమాటా జ్యూస్ అన్నిటినీ కలిపి వలయాల చుట్టూ రాసి, అరగంట తర్వాత కడిగితే సరిపోతుంది.