శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (12:24 IST)

దాల్చిన చెక్క పొడిని గ్రీన్‌ టీలో వేసుకుని తాగితే..

చలికాలం వచ్చేస్తోంది. మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో జలుబు, దగ్గు వేధిస్తాయి. అందుకే చలికాలంలో ఆరోగ్య నిపుణులు పోషకాహారం తీసుకోవాలంటున్నారు. దీనికి తోడు ఔషధ గుణాలున్న

చలికాలం వచ్చేస్తోంది. మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో జలుబు, దగ్గు వేధిస్తాయి. అందుకే చలికాలంలో ఆరోగ్య నిపుణులు పోషకాహారం తీసుకోవాలంటున్నారు. దీనికి తోడు ఔషధ గుణాలున్న పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను ఆహారంలో చేర్చుకోవాలి. దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేస్తుంది. 
 
శరీర ఉష్ణోగ్రతను చలికాలానికి అనుగుణంగా మార్చుతుంది టీ, కాఫీ, గ్రీన్ టీ తయారీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు జలుబు, దగ్గులాంటి రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు. 
 
అలాగే అల్లాన్ని తప్పకుండా వర్షాకాలం, చలికాలంలో ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. అల్లం తీసుకోవం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జలుబు, దగ్గు దరిచేరదు. నువ్వుల పొడి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ముఖ్యంగా శీతాకాలంలో నువ్వుల పొడిని తీసుకుంటే...శరీరానికి కావలసిన ఇనుమును అందిస్తుంది. పసుపు కూడా చలికాలంలో వ్యాధులతో పోరాటం చేస్తుంది. గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం ద్వారా గొంతు నొప్పి, జలుబు నయం అవుతుంది. కోడిగుడ్లను, మిరియాలను కూడా చలికాలంలో డైట్‌లో చేర్చుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.