Daily Horoscope
✕

పేగుల్లోని వ్యర్థాలను సులభంగా తొలగించాలంటే..? (video)

Written By సెల్వి
Updated: బుధవారం, 3 జూన్ 2020 (18:58 IST)
Stomach
శరీరంలోని మలినాలను సులభంగా తొలగించుకోవాలంటే నీటిని ప్రధానంగా తీసుకోవాలి. అందుకే ఉదయం నిద్రలేచి.. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిని సేవించాలి. ఇలా చేస్తే పొట్టలోని వ్యర్థాలు తొలగిపోతాయి. ఇంకా ఆ గోరు వెచ్చని నీటిలో తేనె ఒక స్పూన్, లెమన్ జ్యూస్ ఒక స్పూన్ కలిపి తీసుకుంటే మెటబాలిజం మెరుగు అవుతుంది. 
 
ఇంకా రోజుకు 8-10 గ్లాసుల నీటిని సేవించాలి. నీటిని సేవించడం ద్వారా శరీరంలో అవయవాలను శుభ్రం చేసుకోవచ్చు. అందుకే పరగడుపున నీటిని సేవించడం మరిచిపోకూడదు. అర లీటరు నుంచి ఒక లీటర్ వరకు తాగడం చేయొచ్చు. 
 
అలాగే పొట్ట పేగుల్లోని వ్యర్థాలను తొలగించుకోవాలంటే.. రోజూ ఓ ఆపిల్‌ను తీసుకోవాలని.. రోజూ ఉదయం ఓ గ్లాసుడు ఆపిల్ జ్యూస్ సేవించడం మంచి ఫలితాన్నిస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు వున్నాయి. లెమన్ జ్యూస్, ఉప్పు, తేనే చేర్చి గోరు వెచ్చని నీటిని ఉదయం పూట సేవించడం ద్వారా మలబద్ధకం తొలగిపోతుంది. రాస్బెర్రీ, ఆపిల్స్, బఠాణీలు, బ్రోకోలీతో పాటు చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు తీసుకోవచ్చు. ఇవన్నీ పొట్టలోని పేగుల్ని సులభంగా శుభ్రం చేస్తాయి. 
 
క్యారెట్, కీరదోస, క్యాబేజీ, బీట్ రూట్, టమోటా, ఆకుకూరలు, కూరగాయల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలను కూడా జ్యూస్ రూపంలో చేర్చుకోవచ్చు. ఇవి పొట్టలోని పెద్ద పేగుల్లోని వ్యర్థాలను తొలగిస్తాయి. 
juice
 
ఇకపోతే.. కలబంద రసంలో కాస్త లెమన్ జ్యూస్ కలుపుకుని రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే అజీర్తి వుండదు. చర్మ సమస్యలుండవు. తలనొప్పి తొలగిపోతుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే పొట్టలోని పేగులు శుభ్రమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

అన్నీ చూడండి

దేవరగట్టులో దసరా పండుగ- బన్ని ఉత్సవంలో ఒక వ్యక్తి మృతి

డెలివరీ ఫ్రాంక్‌తో వైరల్... వీరణికి ఇన్‌స్టా మార్ట్ దీపావళి సర్‌ప్రైజ్ (వీడియో)

కర్నాటక విధాన సౌథలో బాంబు పేలుడా? ఏఐ వీడియో - యువకుడి అరెస్టు (Video)

అక్టోబర్ 22, 2026 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుందంటే?

మార్కో రూబియో, సెర్గియో గోర్‌లకు జామ్ నగర్‌కు స్వాగతం పలికిన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ

అన్నీ చూడండి

Sai Dharam Tej: నవంబరులో సాయి ధరమ్ తేజ్ వివాహం.. గోప్యంగా వధువు వివరాలు..?

RC 17 Update: రామ్ చరణ్, సుకుమార్‌ల ఆర్‌సి17 పూజా కార్యక్రమం అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో

గ్రామీణ నేపథ్యంతో రాయవలస చిత్రం భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు

సన్ ఆఫ్ కనకదుర్గమ్మ లో లయ పోస్టర్ రిలీజ్ చేసిన అశ్వనీదత్, స్వప్న దత్

Fauji glimpse Update: ప్రభాస్ పుట్టినరోజు సర్‌ప్రైజ్: ఫౌజీ గ్లింప్స్ వీడియో రిలీజ్

తర్వాతి కథనం
Show comments