Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నోటి దుర్వాసన సమస్యకు ఇలా చేస్తే..? ఆ నాలుగు..?

Written By సెల్వి
Updated: సోమవారం, 20 జులై 2020 (23:24 IST)
నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు మౌత్ వాష్‌లని, చూయింగ్ గమ్‌లని ఎక్కువగా తీసుకుంటుంటారు. అలా కాకుండా సహజ పద్ధతుల్లో నోటి దుర్వాసనను నివారించుకోవచ్చు. నోటి దుర్వాసనకు ఉప్పు నీరు మేలు చేస్తుంది. ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత తప్పనిసరిగా ఉప్పు నీటితో నోటి శుభ్రం చేసుకుంటే చక్కని ఫలితం దక్కుతుంది. 
 
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కళ్లుప్పు వేసుకుని కలిపి దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి. అదీ ఆహారం తీసుకున్న తర్వాత ఇలా చేయడం ద్వారా నోరు శుభ్రమవతుంది. ఇంకా దుర్వాసన వుండదు. రోజులో కనీసం రెండు మూడు లవంగాలు, సోంపు వంటివి తింటుండాలి. ఇందులో ఉండే మంచి లక్షణాలు నోట్లోని బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.
 
కొంచెం మిరియాల పొడి, పసుపు, కాస్త ఉప్పు, అందులో నువ్వుల నూనె వేసి పేస్టులా చేసుకుని ఈ పేస్ట్‌తో పళ్లను తోమితే నోటి దుర్వాసన వుండదు. తద్వారా పంటి సమస్యలు తీరడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. ఔషధగుణాలున్న నిమ్మరసంతో బ్రష్‌ చేయడం వల్ల దుర్వాసనను తగ్గించుకోవచ్చు.
 
రోజులో రెండు సార్లు బ్రష్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. టూత్‌ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను వినియోగించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

October 07, 2026: బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అందమైన అమ్మాయిలా పరిచయమై వృద్ధుడికి హనీట్రాప్, రూ. 38 లక్షలు లాగేసి...

జ్ఞానేష్ కుమార్‌పై చర్యలకు డిమాండ్.. న్యూఢిల్లీలో హైడ్రామా.. రాహుల్, ప్రియాంకాల అరెస్ట్.. ఆపై? (video)

130 ఏళ్ల వాతావరణ చరిత్రలో పూరీలో గరిష్టంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత

ఎర్రవల్లి గ్రామంలో అదృశ్యమైన 45 ఎకరాల భూమిని గుర్తించాలి.. రేవంతన్న ఆదేశాలు

అన్నీ చూడండి

Anupama Parameswaran: థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న క్రేజీ కల్యాణం మూవీ

Teja Sajja: ది ట్రెయిటర్స్ తెలుగు ట్రైలర్‌ రావడం ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ

కామ్రేడ్ కళ్యాణ్ ప్రేమతో పడితే ఏమయిందనే పాయింట్ తో ట్రైలర్ రిలీజ్

NBK 111: దాదా- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

Anil ravipudi: స్నేహితుల కథతో సరిపోయారు ఇద్దరూ టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments