బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (13:13 IST)

ప్రతిరోజూ వంటల్లో మినప పప్పును చేర్చుకుంటే?

మినపప్పు వెన్నెముకకు బలాన్నిస్తుంది. అంతేకాకుండా మినపప్పులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. అందుచేత వారానికి రెండుసార్లు వంటల్లో మినపప్పును చేర్చుకుంటే మంచిది. ఇవి శరీరానికి కావలసిన

మినపప్పు వెన్నెముకకు బలాన్నిస్తుంది. అంతేకాకుండా మినపప్పులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. అందుచేత వారానికి రెండుసార్లు వంటల్లో మినపప్పును చేర్చుకుంటే మంచిది. ఇవి శరీరానికి కావలసిన విటమిన్స్‌ను అందిస్తాయి.
 
కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తాయి. శ్వాస అవరోధాలను దూరం చేస్తాయి. జీర్ణశక్తిని పెంచుటలో మినపప్పు బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
అల్లం అజీర్తికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరోచనాలను దూరం చేస్తుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాల వలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది. వంటింట్లో ప్రధానంగా ఉండే పసుపు యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపు రక్తశుద్ధికి, కాలేయం, కంటి వ్యాధులకు, గాయాలు మానుటకు, వాపులతో కూడిన నొప్పులకు ఇలా ఎన్నో వాటికి ఔషధాలుగా వాడుతుంటారు.