బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (15:55 IST)

ధనుస్సు రాశి వారు గురుగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.... ఏం చేయాలి?

గురుగ్రహ దోష నివారణకు నవరత్నాల్లోని కనకపుష్యరాగాన్ని ధరించడం మంచి ఫలితాలనిస్తుందని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ పుష్యరాగాన్ని ధనుస్సురాశి జాతకులు ధరించాలి. ఈ రాశికి అధిపతి బృహస్పతి. కావున ధనుస్సురాశి జాతకులంతా దయాహృదయులుగా ఉంటారు. మృదువుగా సం

గురుగ్రహ దోష నివారణకు నవరత్నాల్లోని కనకపుష్యరాగాన్ని ధరించడం మంచి ఫలితాలనిస్తుందని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ పుష్యరాగాన్ని ధనుస్సురాశి జాతకులు ధరించాలి. ఈ రాశికి అధిపతి బృహస్పతి. కావున ధనుస్సురాశి జాతకులంతా దయాహృదయులుగా ఉంటారు. మృదువుగా సంభాషించడం, అధికారం చెలాయించడం వీరి నైజం.
 
ఈ రాశికి చెందిన జాతకులు కనకపుష్యరాగ రత్నాన్ని ధరించడం ద్వారా బలము, నేత్రజ్యోతి పెరుగుతుందని రత్నాలశాస్త్రం పేర్కొంటుంది. వ్యాపారము, వ్యవసాయములలో వృద్ధి చెందడంతో పాటు, చదువు, అభ్యాసముల్లో ప్రగతి చెందుతారు. 
 
పుష్యరాగాన్ని ఎలా కనుగొనాలంటే?
కనకపుష్యరాగంపై ఎటువంటి చారలు ఉండవు. చూసేందుకు పారదర్శకంగానూ, కాంతివంతంగానూ ఉంటుంది. పుష్యరాగాన్ని చేతిలో తీసుకుంటే బరువుగా ఉంటుంది. అసలైన పుష్యరాగాన్ని ఎండలో ఉంచితే వెలుగు వ్యాపిస్తుంది.
 
ఎలా ధరించాలంటే?
కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. గురువారం సూర్యోదయ సమయంలో ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. బంగారంతో పుష్యరాగాన్ని ఇమిడ్చి ధరించడం మంచిది. ముందుగా పాలలో గానీ, గంగాజలములో గానీ శుద్ధిచేయాలి. పుష్యరాగాన్ని ధరించే ముందు 160 సార్లు గురుధ్యాన శ్లోకములు ధ్యానించడం మంచిది.