బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (11:49 IST)

మార్చి నెలలో జన్మించారా? ప్రయాణాల్లో ఆ రంగు వద్దే వద్దు..

మార్చి నెలలో పుట్టిన వ్యక్తులు ప్రయాణాలతోనే అధిక సమయం గడుపుతుంటారు. 19 జనవరి నుంచి మార్చి 21వ తేదీ లోపు జన్మించిన జాతకులకు సంఖ్యాశాస్త్రం ప్రకారం బుధుడు బృహస్పతి (నవగ్రహాల్లో ఐదో సంఖ్య-గురువు అని కూడా

మార్చి నెలలో పుట్టిన వ్యక్తులు ప్రయాణాలతోనే అధిక సమయం గడుపుతుంటారు. 19 జనవరి నుంచి మార్చి 21వ తేదీ లోపు జన్మించిన జాతకులకు సంఖ్యాశాస్త్రం ప్రకారం బుధుడు బృహస్పతి (నవగ్రహాల్లో ఐదో సంఖ్య-గురువు అని కూడా పిలుస్తారు). వీరికి సిగ్గు, మొహమాటం ఎక్కువ. వీరికి సృజనాత్మక ఎక్కువ. ఎరుపు రంగు వీరికి అనుకూలిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడో నెంబర్‌గా మార్చి నెలలో పుట్టిన వారిని పరిగణిస్తారు. ఆధ్యాత్మిక చింతన, నిరంతర కృషి చేసే ఈ జాతకులు వ్యాపారాల్లో రాణిస్తారు. వీరికి ఆగ్నేయం, నైరుతి దిశల్లో వీరికి ఉద్యోగాలు కలిసివస్తాయి.
 
కానీ వాయువ్య దిశలో ఉద్యోగాలు మంచివి కావు. 1,3, 5,7,8 సంఖ్యల్లో పుట్టిన వారిని వీరు వివాహం చేసుకోవచ్చు. అయితే 2, 4, 6 సంఖ్యల్లో పుట్టిన వారిని వివాహం చేసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదు. బ్యాంకు ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మార్చిలో పుట్టిన వారికి సంఖ్యాశాస్త్ర ప్రకారం అనుకూలిస్తాయి. పసుపు, గులాబీ, తెలుపు, పచ్చ, డార్క్ బ్రౌన్, లైట్ బ్లూ కలిసి వస్తాయి. 
 
దూర ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు డార్క్ బ్లూ, నలుపు దుస్తులు వాడకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఊపిరితిత్తులు, మధుమేహం, చర్మ సమస్యలు, ఆస్తమా వంటివి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. గురువారాల్లో శుభ కార్యాలు మొదలెడితే విజయవంతం అవుతాయి. పుష్యరాగాన్ని బంగారంలో పొదిగించుకుని ధరించడం ద్వా ఆశించిన ఫలితాలు చేకూరుతాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. 
 
అదృష్ట సంఖ్యలు: 3, 6, 9 
అదృష్ట మాసాలు : మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ 
అదృష్ట రోజులు : బుధ, గురు, శుక్రవారాలు 
అదృష్ట రంగులు : ఆరెంజ్, ఊదా.