శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: శుక్రవారం, 29 జూన్ 2018 (22:22 IST)

బంతిపూవులో ఉండే పూలబొడ్డును దంచి తింటే అవి తగ్గుతాయి...

బంతి చెట్టు వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బంతి పూలను దండలుగా గుచ్చి పండుగ రోజులలో ఇంటి గుమ్మానికి వ్రేలాడదీస్తారు. బంతిపూలను అనేక రకాల ఫంక్షన్స్, డెకరేషన్స్‌కు, దేవుడికి అలంకరణ చేయడానికి, ఇలా అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాము. అంతేకాకుండా దీని వలన చ

బంతి చెట్టు వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బంతి పూలను దండలుగా గుచ్చి పండుగ రోజులలో ఇంటి గుమ్మానికి వ్రేలాడదీస్తారు. బంతిపూలను అనేక రకాల ఫంక్షన్స్, డెకరేషన్స్‌కు, దేవుడికి అలంకరణ చేయడానికి, ఇలా అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాము. అంతేకాకుండా దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బంతి పూవు మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.
 
1. బంతి ఆకు నుంచి రసం తీసి త్రాగితే మూర్చ, బ్రెయిన్ వ్యాధి తగ్గి మెదడుకు మంచి బలము వస్తుంది.
 
2. చెవి నొప్పితో బాధపడేవారు బంతి ఆకు రసాన్ని కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకొనినచో ఉపశమనం కలుగుతుంది.
 
3. బంతిపూవులో ఉండే పూలబొడ్డును దంచి దీనికి సమ భాగం పంచదార కలిపి ఒక టీ స్పూన్ చొప్పున తీసుకొనిన ఉబ్బసం, దగ్గు తగ్గుతుంది.  
 
4. బంతి ఆకు రసాన్ని ప్రతిరోజు క్రమంతప్పకుండా సేవించటం వలన ఆకలి వృద్ధి అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
 
5. స్త్రీలలో ఋతుక్రమం సక్రమంగా జరగటానికి బంతి ఆకుల కషాయానికి బెల్లము కలిపి త్రాగినచో మంచి ఫలితం ఉంటుంది.
 
6. బంతి ఆకులకు మిరియాలు కలిపి నూరి ఆ పేస్టును వారంలో రెండురోజుల చొప్పున సేవించటం వలన ప్రేగులు శుభ్రపడి మూలవ్యాధి తగ్గుతుంది.