మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (09:59 IST)

కొబ్బరితో బరువు తగ్గొచ్చా..?

కొబ్బరితో బరువు తగ్గడం ఈజీ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. శరీరాన్ని నడిపించే గ్లూకోజ్‌ అయిపోతే.. శక్తి కోసం కీటోన్లపై శరీరం ఆధారపడుతుంది. రక్తంలో కీటోన్లు ఎక్కువగా ఉంటే ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గిపోత

కొబ్బరితో బరువు తగ్గడం ఈజీ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. శరీరాన్ని నడిపించే గ్లూకోజ్‌ అయిపోతే.. శక్తి కోసం కీటోన్లపై శరీరం ఆధారపడుతుంది. రక్తంలో కీటోన్లు ఎక్కువగా ఉంటే ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గిపోతామని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ కీటోన్లని పెద్దమొత్తంలో వేగంగా తయారుచేసే శక్తి కొబ్బరికి ఉంటుంది. 
 
అందుకే ఆహారంలో కొబ్బరి నూనె వాడకాన్ని పెంచాలి. కానీ అతిగా కొబ్బరిని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి కోరు, పొడి రూపంలో వంటల్లో కలిపి మితంగా తీసుకోవడంవల్ల తేలిగ్గా జీర్ణమయి కావాల్సిన పోషకాలు అందుకోవచ్చునని.. అయితే నూనెను మాత్రం మితంగా వాడాలని వారు చెప్తున్నారు. 
 
కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులున్నాయి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటిబాక్టీరియల్, యాంటివైరల్ లక్షణాలున్నాయి. ఇవన్నీ శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జీర్ణాశయ వ్యవస్థకు కొబ్బరి నూనె చాలా మంచి చేస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అజీర్ణం, చికాకు పెట్టే పేగు వ్యాధి వంటి రుగ్మతలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.