శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (22:08 IST)

చియా గింజలతో బోలెడన్ని ఉపయోగాలు, ఏంటో తెలుసా?

Chia seeds
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాల్షియం, జింక్, కాపర్ ఫైబర్, ప్రోటీన్లతో కూడిన చియా విత్తనాలను స్మూతీస్- జ్యూస్‌లకు జోడించబడుతుంది. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా అనేక వ్యాధులను దరిచేరకుండా చూస్తాయి.
 
చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్‌లో చియా విత్తనాలు మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. చియా విత్తనాల్లో మెగ్నీషియం ఉంటుంది, ఇది కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి అధిక రక్తపోటును అదుపులో ఉంటుంది. చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మనిషి త్వరగా అలసిపోడు.
 
చియా విత్తనాల్లో కాల్షియం, జింక్, విటమిన్ ఎ, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నందున దంత వ్యాధులను అడ్డుకుంటాయి.
 
చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటాయి, అందువల్ల ఇవి తీసుకునేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.