గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 10 జూన్ 2023 (20:19 IST)

స్లిమ్‌గా మారాలంటే ఏం చేయాలి?

slim beauty
ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి.
 
ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని 12 సార్లు చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి. వీలైతే వారానికోసారి వైద్యుల సలహాతో ఉపవాసం పాటించవచ్చు. కుదిరితే కనీసం 3 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తే కొవ్వు కరిగిపోతుంది.