ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (21:48 IST)

గుమ్మడికాయ ఎవరు తినకూడదు? గుమ్మడికాయ లాభాలు ఏమిటి?

కొంతమంది గుమ్మడికాయ తిన్న తర్వాత అలెర్జీని ఎదుర్కొంటారు. ఇది స్వల్పంగా మూత్రవిసర్జనకు సమస్య తెస్తుంది. అలాగే లిథియం వంటి ఔషధాలను తీసుకునే వ్యక్తులకు ఇది హాని కలిగించవచ్చు. గుమ్మడికాయ ఆరోగ్యకరమైనదే కాని గుమ్మడికాయ ఆధారిత జంక్ ఫుడ్స్ లాట్స్, పైస్ మరియు క్యాండీలు చక్కెరతో తయారుచేయబడతాయి, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలా కాకుండా గుమ్మడిని చేయాల్సిన విధంగా చేసి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
1. బూడిదగుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడి కూరగాను వడియాలు గాను వాడతాము. కడుపులో మంటగాని, ఉబ్బరంగాని, అతిదాహం ఉన్నప్పుడు బూడిదగుమ్మడిని తినడం వలన గ్యాస్ ట్రబుల్ నివారించవచ్చు. 
 
2. కడుపులో ఏలికపాములు వున్నప్పుడు గుమ్మడి గింజలను ఎండబెట్టి ఆ తరువాత దోరగా వేయించి, మెత్తగా దంచి ఉప్పు, కారం తగినంత కలుపుకొని తినవచ్చు అలా వాడితే కడుపులోని పురుగులు పడిపోతాయి.
 
3. బూడిదగుమ్మడి రక్తపుష్టిని కలిగిస్తుంది. గర్భాశయ వ్యాధులతో బాధపడే స్త్రీలకు ఇది చలవ చేసి రక్తపుష్టిని కలిగించడానికి దోహదపడుతుంది.
 
4. బూడిదగుమ్మడి లివర్ వ్యాధులన్నింటిలోను అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో తీవ్రతను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో, టి.బి. వ్యాధిలోను నిస్సత్తువను పోగొడుతుంది. ఊపిరితిత్తులకు బలాన్ని యిస్తుంది. బూడిద గుమ్మడి మూత్రవ్యాధులలో చక్కగా పనిచేస్తుంది. మూత్రంలో మంటను చీము దోషమును తగ్గిస్తుంది.
 
5. మొలలు వ్యాధిలో రక్తం పడుతున్న సందర్భంలో బూడిదగుమ్మడి తీసుకుంటే రక్తం పడటం ఆగుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారు తమ చికిత్సలో బూడిదగుమ్మడి కూడా చేర్చితే వ్యాధి త్వరగా తగ్గుతుంది.
 
6. బూడిద గుమ్మడి మెదడుకు చలువ చేస్తుంది. పిల్లలకు హల్వాలా తయారుచేసి పెడితే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
 
7. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడి బాధపడుతున్నవారు బూడిదగుమ్మడి కాయతో మినపప్పు బదులుగా ఉలవలుతో వడియాలు పట్టుకుని తింటే మూత్రపిండాలలో రాళ్ళు కరుగుతాయి.