Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కార్తీక మాసం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

Updated: సోమవారం, 12 నవంబరు 2018 (13:34 IST)
కార్తీక మాసం అంటే ఈశ్వరునికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్వామివారికి పూజలు, నైవేద్యాలు ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు పార్వతీ దేవిని ఆరాధించడం ఆనవాయితి. ఎందుకంటే.. ఈ మాసంలో ప్రతిరోజూ ఇంట్లో దీపాలు వెలింగించి శివపార్వతులను ఆరాధించడం వలన దీర్ఘసుమంగళిగా ఉంటారని విశ్వాసం.. అందువలనే స్త్రీలు కార్తీక మాసం వచ్చిందంటే.. ఉపదీక్షలతో పూజలు చేస్తుంటారు.
 
మరి ఈ మాసం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం.. అంటే.. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కనుక ఈ నెల కార్తీక మాసంగా మారింది. హిందువులు ఈ మాసానికి ఎక్కువగా ప్రధాన్యత ఇస్తారు. ఈ మాసం కార్తీక స్నానాలకు, వ్రతాలకు శుభప్రథమైనది. 
 
ఇంకా చెప్పాలంటే.. కార్తీకమాసానికి సమానమైన మాసం మరోటి లేదు. సత్యయుగంతో సమానమైన యుగమే లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకుభుక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తుంటారు. అలానే రాత్రి వేళ్ళల్లో ఆలయాల యందు లేదా తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపధానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతాలు ఉన్నాయి. 
 
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసం, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రాలు, గంగకంటే పుణ్యప్రథాలైన తీర్థాలు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments