శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (10:27 IST)

తొలి కార్తీక సోమవారం.. భక్తులతో పోటెత్తిన శివాలయాలు

కార్తీకమాసంలో సోమవారాలు పరమ పవిత్రమైనవి. శివకేశవులకు చాలా ప్రతీకరమైన రోజులవి. మానవులందరూ భక్తిశ్రద్ధలతో ఉండాల్సిన ఈ రోజులు.  అలాంటి రోజుల్లో తొలి సోమవారం కావటంతో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తలతో పోటెత్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారి విపరీతంగా పెరిగింది. పాతాళగంగలో స్నానంచేసి భక్తులు స్వామి వారిని దర్శించుకోటానికి క్యూలైన్లలో వేచి వున్నారు. 
 
ఆలయ అధికారులు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. తెలంగాణలోని  వేములవాడ, కీసరగుట్ట, కాళేశ్వరం, వరంగల్ వేయిస్తంభాల గుడి, చెరువుగట్టు, యాదాద్రిలోని శివాలయాలు, నల్గొండ జిల్లా పానగల్ లోని ఛాయా సోమేశ్వరాలయం, కోటిలింగాలలో   పెద్దసంఖ్యలో భక్తులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు.