సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (15:05 IST)

కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే..?

కార్తీక మాసం అంటేనే గుర్తువచ్చే స్వామివారు పరమేశ్వరుడు. స్వామివారు కోరిక వరాలను తీర్చి అందరి మన్ననలను పొందుతారు. ఈ మాసంలో శివుడు ఆరాధించిన వారికి సకలసౌభాగ్యాలు చేకూరతాయని విశ్వాసం. కార్తీక మాసంలో సూర్యుడు తులసి రాశిలో ఉంటే ఈ వ్రతాన్ని పాటించాల్సి ఉంటుంది. అంటే సూర్యుడు తులసిరాశిలో ప్రవేశించిన రోజు నుండి లేదా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి వ్రతాన్ని ఆచరించాలి.
 
విష్ణువు ఈ మాసంలో గోమాత కాలిడిన ప్రాంతంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అలానే నూతులు, చెరువుల్లో కూడా మహావిష్ణువు వెలిసియుండాడని ప్రతీతి. అందువలన ఈ సమయంలో శుచిగా స్నానమాచరించి కాలభైరవ స్వామిని పూజిస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయి. స్నానమాచరించేటప్పుడు బొటన వ్రేలితో పితృదేవతలకు అర్ఘ్యం విడవడం చేయడం వలన పితృదేవతలను తృప్తి పరచిన ప్రాప్తి లభిస్తుంది. 
 
పువ్వులతో భక్తిశ్రద్ధలతో పూజించాలి. సాయంకాలం శివ,విష్ణు ఆలయాల్లో దీపం వేగించాలి. వీలైతే విష్ణుసోత్రం, శివ సోత్రం జపిస్తే మంచిది. ఈ విధంగా కార్తికమాసంలో భక్తిపరంగా స్నానమాచరించే వారికి మరుజన్మ లేదని మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ జన్మలో మాత్రమే కాకుండా పూర్వ జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి.
 
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, పురుషులు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. కార్తిక వ్రతాన్ని ఆచరించే వారు ప్రతి రోజు శుచిగా స్నానమాచరించి ఉపవాస దీక్షను చేపట్టాలి. ఇలా నెలరోజులపాటు దీక్ష పాటించిన వారికి పాపాలు తొలగిపోవడంతో పాటు విష్ణులోక వాసులవుతారని ప్రతీతి.
 
ఈ నెలలో కావేరీ నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి. అలానే ఈ మాసంలో వచ్చే సోమవారాలలో వ్రతం ఆచరిస్తే కైలాసవాసులవుతారని చెప్తున్నారు. కార్తిక సోమవారం నాడు చేసే స్నాన, దాన, జపాదుల వల్ల వేలకొలది అశ్వమేధయాగాలు చేసినంత ఫలం లభిస్తుంది.