శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:10 IST)

బిల్వదళాలతో శివునికి అభిషేకాలు.. ఎందుకు..?

పరమేశ్వరునికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం. అందువలన స్వామివారికి బిల్వ దళాలతో పూజలు చేస్తుంటారు. ఈ బిల్వ దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే బిల్వదళ

పరమేశ్వరునికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం. అందువలన స్వామివారికి బిల్వ దళాలతో పూజలు చేస్తుంటారు. ఈ బిల్వ దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే బిల్వదళాలు వేసిన జలంతో శివునికి అభిషేకాలు చేయడం వలన భోగభాగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు.
 
శివలింగాన్ని పూజించి పువ్వులతో అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. పరమేశ్వరునికి బిల్వదళాలతో అభిషేకాలు చేయడం వలన భోగభాగ్యాలు లభిస్తాయి. కాబట్టి విశేషమైన పర్వదినాల్లో, మహాశివరాత్రి రోజున బిల్వదళాలతో శివునికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది.