శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (12:32 IST)

విష్ణుమూర్తిని పూజిస్తే...?

ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే భగవంతుడు తమయందు ఉన్నాడనే భరోసా కలుగుతుంది. భగవంతుని ఆరాధన వలన రకరకాల దోషాలు తొలగిపోతాయి శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలతో చెబుతున్నారు. వినాయక

ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే భగవంతుడు తమయందు ఉన్నాడనే భరోసా కలుగుతుంది. భగవంతుని ఆరాధన వలన రకరకాల దోషాలు తొలగిపోతాయి. శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వినాయకుని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి విజయాలు పొందుతారు. శివారాధన చేయడం వలన జన్మజన్మల పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
 
విష్ణుమూర్తి పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయి. తద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వలన ఆపదలు తొలగిపోయి దుష్టశక్తుల పీడలు నివారించబడుతాయి. హనుమంతుని పూజించడం వలన శని దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం వలన సర్పదోషాలు నివారించబడుతాయి. దుర్గాదేవిని పూజించడం వలన దుర్గతులు తొలగిపోతాయి.