Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంపార్టుమెంట్లలో వేచి ఉన్నభక్తులు... అక్కడికే శ్రీవారి లడ్డూలు...

Written By pyr
Updated: సోమవారం, 11 మే 2015 (13:22 IST)
తిరుమల లడ్డూ టోకెన్ల పంపిణీలో మార్పులు జరుగనున్నాయి. భక్తులు ఇక మీద కంపార్టుమెంట్లలోనే టోకెన్లు తీసుకునే అవకాశాన్ని కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను సమకూర్చింది. మరో నాలుగు రోజుల్లో కంపార్టుమెంట్లలోనే టోకెన్లు పొందవచ్చు. 
 
ఇందుకోసం మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 1 నుంచి 13 కంపార్ట్‌మెంట్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం కాలిబాట భక్తులకు ప్రత్యేకంగా టోకెన్లు ఇస్తున్నారు.దానిపై ఉచిత లడ్డూ కోసం ప్రత్యేకంగా స్టిక్కర్ అతికించి అందజేస్తారు. 
 
ఈ టోకెన్‌తో కంపార్ట్‌మెంట్లలో చేరిన భక్తుడికి రూ. 50కి రెండు, రూ. 100కి నాలుగు చొప్పున భక్తుడు కోరిన లడ్డూల మేరకు స్టిక్కర్లు అతికించి, అందజేస్తారు. ఈ విధానం పూర్తిగా విజయవంతమైతే మలి దశలో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని  మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలోనూ లడ్డూ టోకన్లు జారీ చేస్తారు.
 
About Author
pyr
PYR.... Read More

అన్నీ చూడండి

Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

హర్మూజ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేరు : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి : బాబా రాందేవ్

ప్రభుత్వాలు మారినా పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదు : అభిజీత్ దీప్కే

అన్నీ చూడండి

16-08-2026 ఆదివారం ఫలితాలు - చిన్న విషయానికే ఆందోళన చెందుతారు...

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?

Show comments