Dharma Sangrah

జీవితమే కోరిక.. అచేతనమైతే.. పిచ్చివాడిలా పరిగెత్తేలా చేస్తుంది.. సద్గురు

మీరు కోరిక అని దేనినైతే అంటున్నారో, ఆ శక్తి మీ ప్రాణ శక్తి నుంచి వేరైనదేమీ కాదు. మీరు ఒక చోటినుంచి మరొక చోటికి వెళ్లాలనుకున్నారనుకోండి, మీకు అటువంటి కోరిక ఉంది కాబట్టే అది జరుగుతుంది. మిమ్మల్ని ఇక్కడి

Written By selvi
Updated: ఆదివారం, 22 అక్టోబరు 2017 (13:11 IST)
మీరు కోరిక అని దేనినైతే అంటున్నారో, ఆ శక్తి మీ ప్రాణ శక్తి నుంచి వేరైనదేమీ కాదు. మీరు ఒక చోటినుంచి మరొక చోటికి వెళ్లాలనుకున్నారనుకోండి, మీకు అటువంటి కోరిక ఉంది కాబట్టే అది జరుగుతుంది. మిమ్మల్ని ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్ళేది బస్సో, కారో, మరొకటో కాదు, అది మీ కోరికే. మీరు భోజనం చేసేలా చేసేది మీ కోరికే. అందుకని, మీరు దేనినైతే కోరిక అని అంటున్నారో, మీరు దేనినైతే జీవితం అని అంటున్నారో – ఈ రెండిటి మధ్య పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. జీవితమే కోరిక. మీ జీవిత మూలమే ఒక కోరిక.
 
ఇప్పుడు నేను మీ కొరికలని చంపేయండి అని చెపితే, మీకున్న ఒకే ఒక మార్గం – మీరు ఉరి పోసుకోవడమే..! నిజానికి మరొక మార్గమే లేదు. కానీ, నేను చనిపోవాలీ అని అనుకుంటే అది కూడా ఒక కోరికే..! అందుకని ఇలాంటి విషయాలతో మిమ్మల్ని మీరు, మోస పుచ్చుకోకండి. కోరిక అనేది మీ జీవిత సారం. కానీ, అదే సమయంలో మీరు ఈ కోరికని ఒక అంతులేని విషయంగా మలచుకోవద్దు.
 
మీరు కనుక ఒకదానిని తృప్తిపరిస్తే మరొకటి సిద్ధంగా ఉంటుంది. మీరు దానిని కూడా నెరవేరిస్తే మరుసటి రోజు మరొకటి తయారవుతుంది. ఇది మిమ్మల్ని ఎల్లప్పుడూ ఈ చట్రంలో ఉంచుతూనే ఉంటుంది. కొన్ని కోరికలు నెరవేరకుండా ఉంటాయి. ఈ నెరవేరని కోరికలు, ఎంతో విషాదాన్ని కలిగిస్తాయి.
 
మీ కోరికను కనుక పరిశీలించి చూస్తే.. ఇప్పుడు ఉన్నదానికంటే ఇకొంచం ఎక్కువగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఉంటారు. ఇదే కోరిక. మీ కోరిక పరమోన్నతమైనది, అపరిమితమైనది, అంతులేనిది కాకపొతే దీనిని మీరు ఎరుక లేకుండా చేస్తున్నారు. మీరు చెయ్యవలసినదల్లా, మీ కోరికని మీ ఎరుకలోనికి తీసుకుని రావడమే..! ఇప్పుడు ఇది అచేతనంగా ఉంది. కోరిక అనేది మీరు నివసిస్తున్న సామాజిక పరిస్థితులకు ఒక స్పందన మాత్రమే..! ఇది మీరు అనంతంగా ఎదగాలి అన్న కాంక్షని, అచేతనంగా వ్యక్తపరచడమే అవుతుంది.
 
మీరు కనుక కోరిక అన్న ప్రక్రియను ఒక సచేతన ప్రక్రియగా మలిస్తే అప్పుడు, కోరికతో ఎటువంటి సమస్యా లేదు. కోరిక అనేది ఒక అద్భుతమైన వాహనమే. ఇది మిమ్మల్ని ఎన్నో చోట్లకి తీసుకువెళ్తుంది. మీరు ముక్తిని పొందాలన్నా సరే, దానికి కోరిక కావాలి. కోరికల ప్రక్రియని ఎరుకతో చేస్తే.. అది మీకు ఒక గొప్ప సాధనం అవుతుంది. అది గనక అచేతనంగా అభివ్యక్తం అవుతుంటే.. అది మిమ్మల్ని ఒక పిచ్చివాడిలా పరిగెత్తిస్తుంది.

అన్నీ చూడండి

కామారెడ్డి జిల్లా.. యాసిడ్ దాడి ఘటనలో మహిళ మృతి.. భర్తే ఆ పని చేశాడా?

బేగమ్ బజార్‌లో 3,83,800 అమెరికన్ వజ్రాలతో బంగారు పూత గణేశుడు (video)

రూ. 3300 కోట్లకు అధిపతి, భిక్షగాడిలా అయ్యాడు, ఎందుకు?, వీడియో

నాగోలులో రౌడీషీటర్ నయీమ్‌ హత్య

ఏపీలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..

అన్నీ చూడండి

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

#HappyVinayakaChavithi : వినాయక చవితి వ్రత కథ - గణపతి జననం

13-09-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా...?

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

తర్వాతి కథనం
Show comments