శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (13:55 IST)

శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజిస్తే?

జీవితంలో కష్టాలు లేని మనుష్యులే లేరు. ఆర్థిక పరమైన సమస్యల వలన అందరు సతమతమవుతుంటారు. ఇలాంటి సమస్యల వలన మనశ్శాంతిని కోల్పోయి ఆందోళన చెందుతుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు సహాయపడేవారు వరలక

జీవితంలో కష్టాలు లేని మనుష్యులే లేరు. ఆర్థిక పరమైన సమస్యల వలన అందరు సతమతమవుతుంటారు. ఇలాంటి సమస్యల వలన మనశ్శాంతిని కోల్పోయి ఆందోళన చెందుతుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు సహాయపడేవారు వరలక్ష్మీ అమ్మవారేనని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది. సకల సౌభాగ్యాలు కూడిన ఈ వరలక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన జీవితంలో ఏర్పడే ఎలాంటి సమస్యలనుండైన విముక్తి చెందవచ్చును.
  
 
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రోజున వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చునని చెబుతున్నారు. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లోని తూర్పు దిశలో వరలక్ష్మీ అమ్మవారిని పీఠంపై ఉంచి తొమ్మిది పోగుల తోరమును ధరించి నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. 
 
అదే రోజున పూజలు చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన పువ్వులను, ప్రీతికరమైన నైవేదాలను సమర్పించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వలన ఉత్తమమైన ఫలాలు లభిస్తాయని సాక్షాత్తు పరమశివుడే పార్వతేదేవికి చెప్పారట. అందువలన ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే ఆమే అనుగ్రహం తప్పకుండా దక్కుతుంది.