శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హోలీ పండుగ
Written By ivr
Last Modified: శనివారం, 24 ఫిబ్రవరి 2018 (15:32 IST)

హోలీ రంగులు... ప్రతి రంగుకీ ఓ కథ వుంది...

హోలీ పండుగనాడు రంగులను కలగలిపి ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. ఈ రంగుల్లోని ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. గతంలోని అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అటువంటి కలర్స్ గురించి కాస్తంత తెలుసుకుందామా... ఎరుపు: ఎరుపు రంగు అనంతమైన ప్ర

హోలీ పండుగనాడు రంగులను కలగలిపి ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. ఈ రంగుల్లోని ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. గతంలోని అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అటువంటి కలర్స్ గురించి కాస్తంత తెలుసుకుందామా...
 
ఎరుపు: ఎరుపు రంగు అనంతమైన ప్రేమస, సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీక. ఎరుపు మన ఏకాగ్రతను ఆకర్షిస్తుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
 
గులాబి రంగు: ప్రేమను వ్యక్తీకరించేగది గులాబి. లేత గులాబి రంగుతో పడక గదిని అలంకరిస్తే... ఆనందం వెల్లివిరిస్తుంది. మధురమైన భావనలను ఇది కలిగిస్తుంది. అక్కడక్కడా నలుపు చారలు ఉంటే మరింత అందాన్నిస్తుంది.
 
పసుపు: శక్తికి, వెలుగుకూ పసుపు రంగు ప్రతీక. తెలివికి ఈ రంగు సూచిక. వంట గదులు, భోజనాల గదులకు పసుపు రంగు వేస్తే గది వాతావరణం ఆహ్లాదాన్నిస్తుంది.
 
నారింజ: ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వం కలిగిస్తుంది. నవ్వుతూ, తుళ్లుతూ ఉండేలా ఈ రంగు తన ప్రభావాన్ని చూపుతుంది.
 
నీలం: ప్రశాంతత, నెమ్మది, దైవత్వంతో సంబంధం ఉన్న రంగు నీలం. ఇది సృజనాత్మకతను కలిగిస్తుంది. ఉత్సాహాన్నిస్తుంది. 
 
ఆకుపచ్చ: ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు ఆకుపచ్చ. ఇది శాంతి, పవిత్రత, విశ్రాంతిని అందిస్తుంది. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని భావిస్తారు.
 
ఊదారంగు: పసుపు, ఎరుపు రంగుల మిశ్రమమే ఊదారంగు. నాణ్యత, సంపద, ఉద్రేకాలకు ఇది గుర్తు. రాజసమైన రంగు ఇది. 
 
నలుపు: ఈ రంగు విలాసానికి, రహస్యానికి గుర్తు. అదేవిధంగా శక్తి, భయం, అధికారానికి ఇదే గుర్తు. 
 
కనుక ఇన్ని రహస్యాలు దాగి ఉన్న అన్ని రంగులను మిళితం చేసి జరుపుకునేదే హోలీ.