1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (22:38 IST)

హాలీవుడ్‌లోకి దృశ్యం.. మరిన్ని పాశ్చాత్య భాషల్లో..

Drishyam
Drishyam
నాటు నాటు పాట ఆస్కార్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. స్టీవెన్ స్పీల్‌బర్గ్ లాంటి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు భారతీయ చిత్రాల గురించి మాట్లాడేలా చేసింది. భారతీయ సినిమా గర్వాన్ని చాటిచెప్పే మరో సంచలనాత్మక చిత్రంగా ఇది నిలిచింది. 
 
తాజాగా మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన థ్రిల్లర్ "దృశ్యం" రీమేక్ కానుంది. దృశ్యం మూవీ ఇప్పటికే భారతీయ, చైనా మార్కెట్‌లలో విజయవంతమైన థ్రిల్లర్‌గా నిలిచింది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ మూవీ తెలుగు, తమిళం, హిందీలో రీమేక్ చేయబడింది.
 
ఈ నేపథ్యంలో జీతూ జోసెఫ్ దృశ్యం ఇప్పుడు పనోరమా స్టూడియోస్ ద్వారా ఆంగ్లంలోకి రీమేక్ చేయబడుతోంది. హాలీవుడ్‌లో దృశ్యంను తెరకెక్కించడానికి వారు గల్ఫ్‌స్ట్రీమ్ పిక్చర్స్, JOAT ఫిల్మ్‌లతో చేతులు కలిపారు. 
 
దృశ్యం 1, 2 అంతర్జాతీయ రీమేక్ హక్కులను అసలు నిర్మాతలు ఆశీర్వాద్ సినిమాస్ నుండి పనోరమా స్టూడియోస్ పొందింది. గల్ఫ్‌స్ట్రీమ్‌కి చెందిన కర్జ్, బిండ్లీ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించిన టైమ్‌లెస్ థ్రిల్లర్.
 
అమెరికాలోని అభిమానులకు సినిమాను తీసుకురావడానికి సన్నద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా మరిన్ని పాశ్చాత్య భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ కానుంది.