సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By tj
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (18:49 IST)

గుండె నొప్పి రాకుండా ఉండాంటే ఇదొక్కటే మార్గం..

కడుపులో వికారంగా ఉండి పుల్లని తేపులతో బాధపడేవారు కొంచెం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులిపురుగులను నివారిస్తుంది.

కడుపులో వికారంగా ఉండి పుల్లని తేపులతో బాధపడేవారు కొంచెం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరచూ నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వల్ల కలిగే బాధలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీపీని అదుపులో ఉంచుతుంది. గుండె నొప్పులు రాకుండా కాపాడుతుంది. 
 
డయేరియాతో బాధపడేవారు ఒక టీస్పూన్ జీలకర్ర నీటితో తీసుకుని ఒక టీస్పూన్ కొత్తిమీర, రసం, జీలకర్ర, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తర్వాత ఇలా రెండు సార్లు తీసుకోవాలి. నల్ల జీలకర్ర మూలశంకు మంచి మందు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నల్లజీలకర్రను వేయించి మగ్గిన అరటిపండుతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది.