శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 డిశెంబరు 2021 (23:35 IST)

శీతాకాలంలో నిస్సత్తువ, నీరసం: నెయ్యిని తీసుకుంటే...

శీతాకాలంలో చాలామంది శక్తిని కోల్పోయి నీరసంగా, అలసటగా కనిపిస్తుంటారు. అలాంటివారికి నెయ్యి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక్కసారి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలిపి సేవిస్తే పై తెలిపిన సమస్యలుండవు. కొంతమందికి ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా జీర్ణవ్యవస్థ అంతగా ఉంటుంది. ఈ సమస్య వలన కడుపునొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి వాటికి గురౌతారు. వీటి నుంచి బయటపడాలంటే నెయ్యిని తరచుగా తీసుకోవాలి. దాంతో జీర్ణవ్యవస్థ మెరుగపడుతుంది. 

 
రోజూ మీరు తయారుచేసుకునే ఆహార పదార్థాల్లో లేదా కూరల్లో కొద్దిగా నెయ్యి వేసి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. దాంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చలికాలంలో చర్మం రక్షణకోసం ఏవేవో మందులు, క్రీములు వాడుతుంటారు. వాటిని వాడడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సౌందర్య సాధనకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు.  అందుకు నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది. 

 
ఒక బౌల్‌లో 5 స్పూన్ల్ నెయ్యిని వేడిచేసుకుని అది బాగా చల్లారిన తరువాత అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా తరచుగా చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది. అల్సర్ వ్యాధితో బాధపడేవారు నెయ్యిని వేడి చేసి అందులో కొద్దిగా చక్కెర లేదా పెరుగు కలిపి సేవిస్తే సమస్య పోతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకొచ్చేస్తాయి.

 
దగ్గు, జలుబు, ముక్కుదిబ్బ వంటి వ్యాధుల నుండి విముక్తి లభించాలంటే.. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్య కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.