మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 18 అక్టోబరు 2023 (16:55 IST)

ఇలా చేస్తే తలలోని చుండ్రు తగ్గిపోతుంది

చాలామందిని వేధించే సమస్యల్లో చుండ్రు సమస్య ఒకటి. ఈ చుండ్రు వల్ల త్వరగా జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ మొండి చుండ్రును వదలగొట్టేందుకు ఇంటి చిట్కాలను తెలుసుకుందాము. చుండ్రు అనేది ఈస్ట్ జాతికి చెందిన ఒక ఫంగస్, దీనిని సాధారణంగా మలాసెజియా అని పిలుస్తారు. కెమికల్ షాంపూలు ఉపయోగించడం వల్ల ఫంగల్‌గా తయారవుతుంది.

నియాసిన్- విటమిన్ బి3, రిబోఫ్లావిన్- విటమిన్ బి2, పిరిడాక్సిన్- విటమిన్ బి6 లోపాలు కూడా చుండ్రుకు కారణమవుతాయి. జుట్టును మంచి సహజమైన షాంపూ లేదా సబ్బుతో కడిగిన తర్వాత వేప లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. ఉల్లిపాయను జుట్టు, మాడుకు పట్టించి అరగంట పాటు ఉంచి తర్వాత జుట్టును కడగాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ రసాన్ని అప్లై చేయడం వల్ల కూడా చుండ్రు తొలగిపోతుంది. ప్రతిరోజూ పెరుగుతో తలస్నానం చేయడం వల్ల చుండ్రు నెమ్మదిగా తొలగిపోతుంది.