వర్షంలో తడిస్తే తక్షణ నివారణ చర్యలేంటి?
సాధారణంగా అక్టోబరు నెలాఖరు నుంచి డిసెంబరు నెలాఖరు వరకు ఈశాన్య రుతుపవనాల కాలం. ఈ కాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో వర్షంతోపాటు చలి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం అధికం.
పైగా, ఈ సీజన్లోనే ప్రాణాంతకమై సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. వర్షంలో తరచూ తడిసే విద్యార్థులకు సీజనల్ వ్యాధులు తొందరగా సోకే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ఈ సీజనల్ వ్యాధుల బారినపడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. నిర్లక్ష్యం చేస్తే ఇటు చదువు అటు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. కొంతమంది పిల్లలు సరదా కోసం వర్షంలో తరచూ ఆడుతుంటారు.
వర్షం నీటిలోని వైరస్‌తో జలుబు చేస్తుంది. వర్షంలో తరచూ తడిచే విద్యార్థులకు న్యూమోనియా, ఉబ్బసం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచివుంది. అలాంటి పిల్లలపై తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు వహించాలి.
వర్షంలు తడిస్తే తక్షణ నివారణ చర్యలను పాటిస్తే అనారోగ్యం బారినపడకుండా తప్పించుకోగలుగుతారు.
* పాఠశాల నుంచి ఇంటికి రాగానే శుద్ధి చేసిన మంచి నీటిని తాగాలి. అవి లేకుంటే కాచి చల్లార్చిన నీటిని తాగితే ఇంకా మంచిది.
* గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బాగుంటుంది. అది వీలుకాకుంటే కాళ్లు, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
* వర్షంలో తడిసిన అనంతరం పొడిగుడ్డతో శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.
* అపరిశుభ్ర ప్రాంతాల్లో తిరగకూడదు.
* వైరస్ సోకిన విద్యార్థి ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాలి.
* అనారోగ్య సమస్యను ప్రాథమిక స్థాయిలో కనిపెడి తే తొందరగా నివారించవచ్చు.
* వర్షానికి తడిసి శరీరం నత్తగా ఉండి, బాధగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
* వైర్‌సతో అనారోగ్యం బారిన పిల్లలు పాఠశాలకు వెళ్లకపోవడం మంచిది. ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది.
* అలాగే, వర్షంలో తడవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గొడుగు పెట్టుకోవడం, రెయిన్ కోటు వేసుకోవడం వంటివి చేయాలి.
* ఒకవేళ గొడుగు, రెయిన్ కోటు లేకుంటే వర్షం తగ్గేంత వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.