మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (21:31 IST)

రావణ దహనంలో పెను విషాదం... రైలు ఢీకొట్టి 50 మందికి పైగా దుర్మరణం(Video)

పంజాబ్‌లోని జోడా పాటక్ ప్రాంతంలో దసరా ఉత్సవాలలో చేసే రావణ దహనం సందర్భంగా పెను విషాదం చోటుచేసుకుంది. దసరా చివరి రోజు కావడంతో రావణ దహనం ఏర్పాటు చేయగా... దాన్ని వీక్షిస్తున్న వారిని అత్యంత వేగంగా దూసుకొచ్చిన హవ్డా ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ధాటికి శవాలు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి.
 
రావణ దహనం రైలు ట్రాక్ పక్కనే కావడంతో అంతా ఆ వేడుకను చూసేందుకు ట్రాక్ వద్ద గుమిగూడారు. ఆ సమయంలో 700 మందికి పైగా వున్నట్లు తెలుస్తోంది. రావణ దహనం తాలూకు వచ్చే టపాసుల భారీ పేలుడు శబ్దంతో తాము నిల్చున్న రైల్వే ట్రాక్ పైన వేగంగా దూసుకు వస్తున్న రైలును గమనించలేకపోయారు. దాంతో ఈ ఘోరం జరిగిపోయింది. 
 
ప్రాధమిక సమాచారాన్ని బట్టి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు చెపుతున్నా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది.