మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By preethi
Last Modified: శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:40 IST)

ట్రైన్‌లో ఫోన్ మాట్లాడుతూ ఫీట్స్ చేసిన యువతి... చివరికి?

ఆ అమ్మాయి వయస్సు 18 ఏళ్లు. అబ్బాయిలు మాత్రమేనా నేను కూడా ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తానంటూ లోకల్ ట్రైన్‌లో సీట్లు ఖాళీగా ఉన్నా సరే ఫుట్‌బోర్డ్ దగ్గర నిలుచుంది.

ఆ అమ్మాయి వయస్సు 18 ఏళ్లు. అబ్బాయిలు మాత్రమేనా నేను కూడా ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తానంటూ లోకల్ ట్రైన్‌లో సీట్లు ఖాళీగా ఉన్నా సరే ఫుట్‌బోర్డ్ దగ్గర నిలుచుంది. అప్పటికే చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఇది సరిపోదన్నట్లు మధ్యలో ఉన్న పల్ పట్టుకుని విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. అలా చేస్తూ చేస్తూ మధ్యలో పట్టు తప్పిపోయి కింద పడి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంది. 
 
అయితే అదృష్టం బాగుండటం వలన ప్రాణాలతో బయటపడింది. ఏ మాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ప్రాణాలు కోల్పోయేదే. వివరాలను పరిశీలిస్తే... ముంబైలో ఘాట్‌కోపర్, విక్రోలీ స్టేషన్ల మధ్య తిరుగుతున్న రైలులో థానె జిల్లా దివాకు చెందిన ఆ యువతి సీఎస్‌టీలో కల్యాణ్ వెళ్లే ట్రెయిన్ ఎక్కింది. అప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
 
ఈ అమ్మాయి విన్యాసాలు చేస్తూ మధ్యలో పట్టు తప్పి ట్రెయిన్ కిందికి జారిపోయింది, అంతలో వెంటనే స్పందించిన ఇతర ప్రయాణికులు ఆ యువతిని పైకి లాగి, ఆమె ప్రాణాలను కాపాడారు. ప్రయాణికులు ఏమాత్రం అలక్ష్యం చేసి ఉన్నా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఈ సంఘటన సోమవారం జరగగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.