సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా?

శుక్రవారం, 19 జులై 2019 (08:07 IST)
సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారు?.. తెలియని వారి కోసం ఈ సమాచారం. సగ్గు బియ్యం తయారికి  కర్ర పెండలం దుంపను వాడతారు. దీన్ని భూమిని నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి పంపించాలి, ఆ దుంపలను నీటిలో బాగా శుభ్రంచేసి దానిపై నున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. 
 
తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుభ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో, పాల లోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గు బియ్యం తయారు చేస్తారు. 
 
ఈ పిండిని వివిధ రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులు తున్నందున ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి పూసల్లాగా జలజలా రాలి పడతాయి. అప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. 
 
ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం మాత్రమే తయారవుతాయి. ఇది సగ్గు బియ్యం తయారీ విధానం. తమిళనాడు కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లో తయారి మిల్లులు ఉన్నాయి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం, మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయని, బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే, బలహీనత తగ్గి తక్షణ శక్తి అందుతుందని వైద్యులు చెబుతారు. 
 
పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం, రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల సగ్గుబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి, షుగర్ పేషంట్లు ఈ ఆహారాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. 
గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అధికరక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.

అన్నీ చూడండి

అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఎస్‌యూవీలో వచ్చి ఎత్తుకెళ్లారు..

విజయ్ సర్కార్ అదుర్స్ .. లంచం తీసుకునే అధికారులకు షాక్.. లక్ష నజరానా

రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ ఆత్మహత్యాయత్నం..? జైలులో దర్శన్‌ను కలిసిన కుటుంబం

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

అన్నీ చూడండి

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

తర్వాతి కథనం
Show comments