పిల్లలకు, మహిళలకు కొర్ర దోసెలు... ఎలా చేయాలో తెలుసా?

Dosa
సిహెచ్| Last Modified సోమవారం, 6 మే 2019 (19:49 IST)
మనం చిరు ధాన్యాలుగా పిలువబడే కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రల్లో అధిక పీచు పదార్దం, మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, మాంగనీసు, మెగ్నీషియం, భాస్వరం లాంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గర్బిణీలకు, చిన్న పిల్లలకు మంచి ఆహారం. కొర్రలతో మనం రకరకాల వంటసు చేసుకోవచ్చు. కొర్రదోశని ఏ విధంగా తయారుచేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు :
కొర్రలు- వంద గ్రాములు,
మినపప్పు- వంద గ్రాములు,
బియ్యం- వంద గ్రాములు,
ఉప్పు- తగినంత,
పుల్ల పెరుగు- తగినంత,

తయారీవిధానం :
కొర్రలు, మిననపప్పు, బియ్యం మూడింటిని కలిపి అయిదు గంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా రుబ్బి ఒక రాత్రి నాననివ్వాలి. తరవాతరోజు పై మిశ్రమానికి ఉప్పు, పుల్ల పెరుగు తగినంత కలుపుకుని నీటితో పిండిని జారుగా కలుపుకోవాలి. తరువాత పొయ్యి మీద పెనం పెట్టి దోశ పలుచగా వేసి నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. అంతే... ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కొర్రల దోశ రెడీ.దీనిపై మరింత చదవండి :