సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:15 IST)

ఆకలిని చంపేసే మల్టీవిటమిన్ మాత్రలు

సరైన ఆహార నియమాలను అనుసరించి వ్యాయామం చేస్తూ ఉండటం ద్వారా అధిక బరువు తగ్గించుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన మార్గం కూడా. అయితే తీరిక లేని వారు లేదా బద్దకస్తులు ఇవి పాటించకుండా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా రసాయనిక మందులు తీసుకుంటారు. ఇది చాలా హానికరం. అనేక దుష్ప్రభావాలు కూడా తలెత్తుతాయి. బరువు తగ్గించే మాత్రలను వాడటం వలన కలిగే సాధారణ సమస్య జీర్ణాశయ సమస్య. 
 
ఈ మాత్రలలో ఉండే ఫ్యాట్ బ్లాకర్స్ అజీర్ణం, గ్యాస్, విరేచనలు కలిగిస్తాయి. వీటిలోని కాంబినేషన్‌ల వల్ల శరీరం విటమిన్‌లను గ్రహించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా విటమిన్‌ల లోపం కూడా కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గించే మాత్రలను వాడే వారు మల్టీవిటమిన్ మాత్రలను కూడా వాడాల్సి వస్తుంది. ఈ మాత్రలలోని సిబుట్రమైన్ అనే సమ్మేళనం ఆకలిని చంపేస్తుంది. 
 
అంతేకాకుండా, హృదయ స్పందన రేటును అసాధారణంగా పెంచి, సరైన సమయానికి చికిత్స అందించకపోతే గుండెపోటుకు కారణం కూడా అవుతుంది. మానసిక రుగ్మతలను కూడా కలిగిస్తుంది. హైబీపీ, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కూడా ఇందు మూలంగా కలుగుతాయి. రక్త పీడనం పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. పెరిగిన మూత్రనాళం మరియు తైల మలం వంటి సమస్యలు బరువు తగ్గించే మాత్రల వాడకం వలన కలుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. తలనొప్పి, కడుపు నొప్పి, నోరు మరియు గొంతు పొడిగా మారటం, మలబద్దకం ఇవి మరికొన్ని దుష్ప్రభావాలు.