చిలకడ దుంపల పచ్చడి... చపాతీల్లో తింటే వదిలిపెట్టరు...

సోమవారం, 8 ఏప్రియల్ 2019 (21:03 IST)
చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. అంతేకాదు వీటిని చట్నీలాగా కూడా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు
చిలగడ దుంప ముక్కలు - ఒక కప్పు,
మినప్పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు,
ఎండుమిర్చి - 5,
చింతపండు - నిమ్మకాయంత,
పచ్చికొబ్బరి తురుము - 4 టేబుల్‌ స్పూన్లు,
నూనె - 2 టీస్పూన్లు. 
తాలింపు కోసం : ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు,
నూనె - తగినంత.
 
తయారుచేసే విధానం:
ఒక స్పూను నూనెలో మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేగించి చల్లారనివ్వాలి. తర్వాత చిలగడ దుంప ముక్కలు, పచ్చికొబ్బరి, చింతపండు, ఉప్పుతో పాటుగా వేగిన పప్పుల మిశ్రమం కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు విడిగా తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి చపాతీలలో, అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.

అన్నీ చూడండి

ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని

కదులుతున్న రైలులో యువకుడిపై హిజ్రాలు దాడి, అసభ్యంగా చూపిస్తూ వీడియో

మావిగన్ అనేది జగన్ తెచ్చిన కొత్త ఆలోచన కాదు.. చెప్పిందెవరంటే?

గంజాయి మత్తులో కారు వీరంగం (వీడియో)

ఇండిగో విమానంలో ఏసీ ఫెయిల్ - ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

RC17: రామ్ చరణ్, సుకుమార్ RC17 యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతోంది !

Varun Tej : కొరియన్ కనకరాజు పాట విడుదలకి భారీ జనసందోహం

ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Niharika: తొమ్మిది కోట్ల బడ్జెట్, ఓటీటీ తిరస్కరణ, నెగెటివ్ టాక్.. వెరసి కమిటీ కుర్రోళ్లు కు జాతీయ అవార్డ్

Ambika Krishna :సినిమాల్లో తెలుగు భాష కనుమరుగవుతుందని వేదన చెందిన అంబికా కృష్ణ .ఎందుకని?

తర్వాతి కథనం
Show comments