శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (21:39 IST)

ఈ వాసన దోమలకు అస్సలు నచ్చదు..?

దోమలను తరిమి కొట్టాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. దోమలను ఇంట్లో చేరనివ్వకపోవడం వల్ల పలు వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా.. లావెండర్ ఆయిల్‌ను కొనితెచ్చుకోవడమే. సువాసనతో కూడిన లావెండర్ ఆయిల్ సహజంగా మంచి సువాసనతో కూడుకున్నది. 
 
ఈ వాసన దోమలకు అస్సలు నచ్చదు. ఇంట్లో దోమలు రాకుండా వుండాలంటే.. లావెండర్ ఆయిల్‌ను ఇంట్లో అక్కడక్కడ చల్లడం ద్వారా దోమలను దూరం చేసుకోవచ్చు. దోమలు కుట్టకుండా వుండాలంటే.. కాసింత లావెండర్ ఆయిల్‌ను చర్మానికి రాసుకోవడం చేయాలి. 
 
అలాగే దోమల బాధ నుంచి తప్పించుకోవాలంటే.. నిమ్మకాయను తీసుకుని రెండుగా కట్ చేసుకోవాలి. అందులో లవంగాలను గుచ్చి.. ఆ నిమ్మకాయను కిటికీలు తలుపుల వద్ద వుంచాలి. దీంతో ఇంట్లోకి దోమలు ప్రవేశించవు. ఇంకా కాఫీ పొడితో కూడా దోమలను తరిమికొట్టవచ్చు. ఇంటి చుట్టూ నీరు నిలిచివున్న చోట కాఫీ పొడిని చల్లితే దోమల బెడద వుండదు.