సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (11:02 IST)

విమానం దొంగతనానికి బాలిక విఫలయత్నం.. అరెస్టు

సాధారణంగా నగదు, బంగారం, తమకు ఇష్టమైన వస్తువులను దొంగతనం చేస్తుంటారు. కానీ, ఆ యువతి మాత్రం ఏకంగా ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నించి, ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ ఆశ్చర్యకర ఘటన కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో యొసమైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 17 యేళ్ళ బాలిక విమానాశ్రయం చుట్టూ ఉన్న కంచెను దాటుకొని ఓ బాలిక కింగ్ ఎయిర్ 200 అనే ప్రైవేట్ విమానం కాక్‌పిట్‌లోకి ప్రవేశించింది. విమానాన్ని తస్కరించాలని భావించి దాన్ని స్టార్ట్ చేసింది. 
 
విమానాన్ని నేలపై కొన్ని చక్కర్లు కొట్టించింది. ఈ క్రమంలో సదరు విమానం దగ్గర్లోని భవనాన్ని ఢీకొట్టింది. విమానం, ఆ భవనం కొంత దెబ్బతిన్నాయి అని ఫ్రెస్నో పోలీసు అధికారి ఒకరు తెలిపారు.