గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (11:21 IST)

బాలికపై రౌడీషీటర్ అఘాయిత్యం.. మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు..

మహిళల పట్ల అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా.. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో చిన్నారి కామాంధుడికి చేతిలో నలిగిపోయింది. విజయవాడలో బాలికపై రౌడీ షీటర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. చిన్నారికి మాయమాటలు చెప్పిన రౌడీ షీటర్ చిన్నరాజా అమ్మాయిని ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీ షీటర్ పై పోస్కో చట్టం కింద కేసు నమాదు చేశారు. ఇటీవలే దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయినా బాలికలపై అత్యాచారాలు ఆగట్లేదు.