గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (19:04 IST)

ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మంది మృతి

accident
ఈజిప్టులో రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మృతి చెందుతారు. 2021లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు ఏడు వేల మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 
 
తాజాగా ఈజిప్టులో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. శనివారం వాడి అల్‌ - నట్రూన్‌ సమీపంలోని కైరో- అలెగ్జాండ్రియా హైవేపై ఈ దుర్ఘటన సంభవించింది. 
 
బస్సు, కార్లు, లారీ ఒకదానికొకటి వరుసగా ఢీకొనడంతో మృతుల సంఖ్య మూడు పదులు దాటింది. ఈ ప్రమాదంలో లారీ బోల్తాపడటం కారణంగా మంటలు చెలరేగి బస్సు, మిన్సీ బస్సు, అనేక కార్లు ధ్వంసమయ్యాయి. ఈ మంటల్లో 18 మంది సజీవ దహనం అయ్యారు.