బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (17:15 IST)

ఆఫ్ఘన్‌లో భారతీయ ఇంజనీర్ల కిడ్నాప్

ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండే ఆప్ఘనిస్థాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్‌కు గురయ్యారు. వీళ్లంతా మినీబస్సులో తాము పని చేసే విద్యుత్ కేంద్రానికి వెళుతుండగా గుర్తుతెలియని సాయుధలు బస్సును అడ్డగించి

ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండే ఆప్ఘనిస్థాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్‌కు గురయ్యారు. వీళ్లంతా మినీబస్సులో తాము పని చేసే విద్యుత్ కేంద్రానికి వెళుతుండగా గుర్తుతెలియని సాయుధలు బస్సును అడ్డగించి కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని బాగ్లాన్ పోలీసులు వెల్లడించారు. అక్కడి గవర్నమెంట్‌కు చెందిన పవర్ ప్లాంట్‌లో వీళ్లు పని చేస్తున్నారు. కాబుల్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా కిడ్నాప్ విషయాన్ని వెల్లడించింది.
 
బాగ్లాన్‌లో ఉండే ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లలో సుమారు 150 మంది వరకు భారతీయ ఇంజనీర్లు పని చేస్తున్నారు. తమ విధులకు వెళ్లే నిమిత్తం ఆయా ప్లాంట్లకు చెందిన బస్సుల్లో వీరంతా వెళుతూ వస్తుంటారు. అలా ఒక బస్సులో వెళుతున్న ఏడుగురు ఇంజనీర్లను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. 
 
దీనిపై ఆప్ఘన్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. వాళ్లను రిలీజ్ చేయించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి కిడ్నాప్‌లు కామన్. అక్కడి స్థానిక ప్రజలను కూడా డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తుంటారు. కాని.. ఇండియన్ ఇంజినీర్లను కిడ్నాప్ చేయడంపై ఏదైనా ఎత్తుగడ ఉందా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.