శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (14:47 IST)

కోహ్లీ కంటే భారీ సిక్సర్లు కొట్టగలను.. కానీ తిండి మాత్రం మానను

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ షాజాద్‌ల మధ్య పెద్దగా పోలికలు లేకపోవచ్చు. కానీ వీరిద్దరూ ఫిట్‌నెస్ విషయంలో పాటించే పద్ధతులు వేరేలా వుంటాయి. కోహ్లీ ఫిట్‌నెస్ కోసం మల

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ షాజాద్‌ల మధ్య పెద్దగా పోలికలు లేకపోవచ్చు. కానీ వీరిద్దరూ ఫిట్‌నెస్ విషయంలో పాటించే పద్ధతులు వేరేలా వుంటాయి. కోహ్లీ ఫిట్‌నెస్ కోసం మల్లగుల్లాలు పడితే.. షాజాద్ మాత్రం బరువు గురించి, తిండి గురించి ఏమాత్రం పట్టించుకోడు. 90 కిలోల బరువుండే షాజాద్‌ ఆహారం తీసుకునే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు. 
 
కోహ్లీ కంటే భారీ సిక్సర్లు కొడుతున్నానని.. అలాంటప్పుడు అతనిలా కఠిన ఆహార నియమాలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ కోసం కసరత్తు చేస్తానని.. అయితే ఆహారం తీసుకునే విషయంలో మాత్రం వెనక్కి తగ్గనని.. కోహ్లీలా కసరత్తులు చేయాలంటే అంత సులభం కాదని చెప్పాడు. 
 
అయినప్పటికీ బరువు తగ్గే ప్రయత్నాల్లో వున్నానని, తాను 50 ఓవర్లపాటు క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయగలననే విషయం కోచ్‌కు బాగా తెలుసునని చెప్పుకొచ్చాడు.