గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 16 ఏప్రియల్ 2018 (19:45 IST)

క్యాల్షియం టాబ్లెట్లు కాదు... ఇవి తింటే ఎముకలు బలంగా...

ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి క్యాల్షియం ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎముకల పటుత్వానికి, కండరాలు దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుంది. దీని లోపం వల్ల ఎముకలు పెళుసుగా మారి పోతాయి. కీళ్ల నొప్పులు అధికంగా వస్తాయి. దీనిని నివారించాలంటే... 1. రోజు వారి ఆహా

ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి క్యాల్షియం ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎముకల పటుత్వానికి, కండరాలు దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుంది. దీని లోపం వల్ల ఎముకలు పెళుసుగా మారి పోతాయి. కీళ్ల నొప్పులు అధికంగా వస్తాయి. దీనిని నివారించాలంటే...
 
1. రోజు వారి ఆహారంలో పాలు, పాలపదార్థాలు ఎక్కువుగా తీసుకోవాలి. వీటిలో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.
 
2. పాలిష్ చేయని ధాన్యం, పాలకూర, టమోట, సోయాబీన్స్‌లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
3. రాగి పిండిలో క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. వీటిని జావలా చేసుకొని ప్రతి రోజు తీసుకోవటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.
 
4. నువ్వులకు, బెల్లంను కలిపి ముద్దగా చేసి ప్రతి రోజు ఒకటి తింటూ ఉంటే ఎముకలకు మంచి పటుత్వం వస్తుంది.
 
5. మునగ ఆకులో క్యాల్షియం శాతం ఎక్కువుగా ఉంటుంది. దీనిని పప్పులో కలిపి వారంలో రెండు రోజులు తీసికోవటం వల్ల శరీరానికి కావల్సిన క్యాల్షియం లభిస్తుంది.
 
6. కోడిగుడ్డు, చేపలు, ఆకుకూరలు క్రమంతప్పకుండా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.