శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (11:19 IST)

పగటిపూట నిద్రమత్తు వీడాలంటే.. పచ్చిమామిడి తినండి..

పగటిపూట నిద్రమత్తు వీడట్లేదా? మధ్యాహ్నం పూట భోజనం చేశాక.. నిద్రమత్తులో జోగుతున్నారా? అయితే పచ్చిమామిడి కాయలను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తింటే నిద్రమత్తు వదిలిపోతుంది. ఇలా చేయడం ద్వారా చురుకుగా పనిచ

పగటిపూట నిద్రమత్తు వీడట్లేదా? మధ్యాహ్నం పూట భోజనం చేశాక.. నిద్రమత్తులో జోగుతున్నారా? అయితే పచ్చిమామిడి కాయలను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తింటే నిద్రమత్తు వదిలిపోతుంది. ఇలా చేయడం ద్వారా చురుకుగా పనిచేస్తారు. శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. పచ్చిమామిడి తీసుకోవడం ద్వారా కాలేయాన్ని శుభ్రం చేసుకోవచ్చు. 
 
చిన్నపేగుల్లో వున్న పైత్య రసాలు బాగా విడుదలవుతాయి. తద్వారా కొవ్వు తొలగిపోతాయి. పేగులు, జీర్ణాశయాల్లో వుండే వైరస్, బ్యాక్టీరియాలు నశిస్తాయి. వేసవిలో లభ్యమయ్యే మామిడి కాయలను తీసుకోవడం ద్వారా.. డీహైడ్రేషన్ దూరమవుతుంది. ఇది వేడిని తగ్గిస్తుంది. శరీరంలో కీలక మినరల్స్‌ను శరీరం నుంచి బయటకు పోకుండా కాపాడుతుంది. 
 
పచ్చిమామిడిని తినడం లేదా జ్యూస్‌ను తీసుకుంటే జీర్ణాశయ సమస్యలు నయం అవుతాయి. డయేరియా, అజీర్తికి చెక్ పెట్టవచ్చు. పచ్చిమామిడి పండ్లలో నియాసిస్ అధికంగా వుంటుంది. తద్వారా గుండె జబ్బులు దూరమవుతాయి. అలాగే అందరినీ వేధించే ఒబిసిటీ సమస్యను పచ్చిమామిడి దూరం చేస్తుంది. పచ్చిమామిడిని తినడం ద్వారా చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.