బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 నవంబరు 2017 (16:01 IST)

సెల్‌ఫోన్ చార్జ్ కోసం దుకాణంలోకి వెళ్లిన యువతి, తలుపు తాళం వేసి రేప్...

కామాంధులు ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో తెలియదు. ఇంగ్లండులో ఓ యువతి తన సెల్ ఫోన్ చార్జ్ అయిపోవడంతో పక్కనే వున్న షాపును చూసి అక్కడ చార్జింగ్ చేసుకునేందుకు లోపలికి వెళ్లింది. అంతే.. అద అదనుగా ఆ షాపు యజమాని దుకాణానికి తాళం వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ

కామాంధులు ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో తెలియదు. ఇంగ్లండులో ఓ యువతి తన సెల్ ఫోన్ చార్జ్ అయిపోవడంతో పక్కనే వున్న షాపును చూసి అక్కడ చార్జింగ్ చేసుకునేందుకు లోపలికి వెళ్లింది. అంతే.. అద అదనుగా ఆ షాపు యజమాని దుకాణానికి తాళం వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలను చూస్తే.... స్వప్నిల్ కులత్ అనే వ్యక్తి మాంచెస్టర్లో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి దుకాణంలోకి ఓ యువతి తన సెల్ ఫోన్ చార్జ్ అయిపోయిందనీ, అవకాశమిస్తే కొద్దిసేపు చార్జ్ చేసుకుని వెళతానని అభ్యర్థించింది. 
 
సర్లే... దాందేముంది, చార్జ్ చేసుకోండి అని ఆమెను లోపలికి ఆహ్వానించాడు. ఆమె అలా వెళ్లి ప్లగ్‌లో ఫోన్ చార్జర్ పెట్టి చార్జ్ చేసేలోపే ఇతడు లోపలివైపు తన దుకాణం షట్టర్ క్లోజ్ చేసి లోపల తాళం కూడా వేసేశాడు. ఈ హఠత్పరిణామానికి భీతిల్లిపోయిన యువతి కేకలు వేసినా ఫలితంలేకపోయింది. ఆమెను కత్తితో బెదిరించడమే కాకుండా కేకలు వేస్తుంటే విచక్షణరహితంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆమె ప్రతిఘటిస్తుండగా ప్రక్కనే వున్న దుడ్డుకర్రతో ఆమెను ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. తీవ్ర గాయాల పాలయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు ప్రవేశపెట్టగా అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.