శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 15 నవంబరు 2017 (13:00 IST)

ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడతా అంతే... లోపలికెళ్లి...?

మహిళలపై దారుణాలు ఆగడంలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా దుర్మార్గుల దారుణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా చెన్నై నగరంలో మరో యువతిని పొట్టనబెట్టుకున్నాడు ఓ యువకుడు. పోలీసులు చెప్పిన వివరాలను చూస్తే... 21 ఏళ్లు ఇందుజా ఎంతో క్రమశిక్షణతో బీటెక్ చదివి మంచ

మహిళలపై దారుణాలు ఆగడంలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా దుర్మార్గుల దారుణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా చెన్నై నగరంలో మరో యువతిని పొట్టనబెట్టుకున్నాడు ఓ యువకుడు. పోలీసులు చెప్పిన వివరాలను చూస్తే... 21 ఏళ్లు ఇందుజా ఎంతో క్రమశిక్షణతో బీటెక్ చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఆమెకు ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. మరికొద్ది రోజుల్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు ఆమె పెద్దలు. ఐతే ఇంతలోనే మృత్యువు ఆమెకు సీనియర్ క్లాస్‌మేట్ రూపంలో వచ్చింది. 
 
బీటెక్ చదువులో వెనుకబడి ఫెయిలై జులాయిగా తిరిగే 22 ఏళ్ల ఆకాష్, ఆమె వెంటపడటం ప్రారంభించాడు. తనను పెళ్లాడాలంటూ వత్తిడి చేయడం మొదలుపెట్టాడు. నిన్ను ప్రేమిస్తున్నాననీ, నీవు లేకపోతే నేను వుండలేనంటూ ఆమెను బలవంతం చేయడం మొదలుపెట్టాడు. ఇందుజ మాత్రం అతడి అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా తనవెంట పడవద్దని సూటిగా చెప్పేసింది. ఐనా అతడు మాత్రం ఆమెను వదల్లేదు. 
 
వీలు చిక్కినప్పుడల్లా ఆమె వెంటపడుతుండటంతో అతడి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు ఇందుజ పేరెంట్స్. దానితో మరింత రెచ్చిపోయిన ఆకాష్, ఓ పథకం ప్రకారం ఆమెను హత్య చేయడానికి నిర్ణయించుకున్నాడు. చాలా జాగ్రత్తగా పెట్రోల్ సీసాను ఎవరికీ కనబడకుండా తన దుస్తుల్లో దాచుకుని ఇందుజ ఇంటికి వచ్చాడు. అయితే అతడిని వెళ్లిపోవాల్సిందిగా ఆమె తల్లిదండ్రులు మందలించారు. 
 
ఒకే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడి ఇక జన్మలో కనబడనని ప్రాధేయపడ్డాడు. దీనితో అతడి మాటలు నమ్మి లోపలికి పంపించారు. లోపలికి వెళ్లిన ఆకాష్ మళ్లీ మొదటికే వచ్చాడు. తనను పెళ్లాడాలంటూ గట్టిగా అరిచాడు. ఇందుజ కోపంతో అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని అరిచింది. అంతే.. వెంటనే తనతో తెచ్చిన పెట్రోల్ సీసా తీసి ఆమెపై పోసి నిప్పింటించాడు. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అక్కడ నుంచి అతడు పరారయ్యాడు. 
 
ఆమెను కాపాడేందుకు ఆమె తల్లి, సోదరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 100 శాతం కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె తల్లి, సోదరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా వున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెపుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.