శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (12:56 IST)

500 మంది విద్యార్థులకు నీలి చిత్రాల వీడియో ప్లే చేసి చూపించిన ప్రొఫెసర్.. ఎందుకు?

ఇలాంటివి అక్కడక్కడా మనం వింటూనే వుంటాం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన గురువులు అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 500 మంది విద్యార్థినీవిద్యార్థులకు సెమినార్లో ఓ అంశాన్ని గురించి మాట్లాడుతూ... దానికి సంబంధించిన వీడియో క్

ఇలాంటివి అక్కడక్కడా మనం వింటూనే వుంటాం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన గురువులు అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 500 మంది విద్యార్థినీవిద్యార్థులకు సెమినార్లో ఓ అంశాన్ని గురించి మాట్లాడుతూ... దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను చూపుతూ పొరబాటున నీలి చిత్రం వీడియోను ప్లే చేసి షాక్‌కి గురిచేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... యూనివర్శిటీ ఆఫ్ టొరొంటోలోని సైకాలజి డిపార్టుమెంట్లో డాక్టర్ స్టీవ్ జూర్డెన్స్ 500 మంది విద్యార్థినీవిద్యార్థులకు పాఠం చెపుతున్నాడు. ఆ పాఠానికి సంబంధించిన చిత్రాలను వివరిస్తూ మధ్యమధ్యలో వీడియోలు చూపుతున్నాడు. అయితే అతడు చూపించిన ఓ వీడియోను చూసి విద్యార్థులు షాక్ తిన్నారు. ఎందుకంటే... అది ఓ నీలి చిత్రం. దీన్ని చూసిన కొందరు విద్యార్థులు పగలబడి నవ్వగా విద్యార్థునులకు ఏం చేయాలో తోచక బిక్కచచ్చిపోయారు. 
 
విద్యార్థుల హావభావాలన్నీ ఒక్కసారిగా మారిపోయేసరికి తను ప్లే చేసిందేమిటో చూసిన ప్రొఫెసర్ కూడా షాక్ తిన్నాడట. పొరబాటు జరిగిందని పిల్లలకు చెప్పాడట. కానీ కొంతమంది మాత్రం సైకలాజీ లెక్చర్ కి తగినట్లుగా వున్నదంటూ కితాబిచ్చారట.