బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (15:00 IST)

ఇండోనేషియాలో సునామీ, భూకంపం.. 384 మంది మృతి

ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ వందలాది సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే 384 మంది ప్రజలను సునామీ,

ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ వందలాది సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే 384 మంది ప్రజలను సునామీ, భూకంపం బలితీసుకుంది. రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైన భూకంపం కారణంగా భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. 
 
ఇక సముద్ర ప్రకోపానికి భారీగా ప్రాణనష్టం కూడా జరిగింది. ఈ ప్రకృతి ప్రకోపానికి 384 మంది ప్రాణాలు కోల్పోగా, 540 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 29 మంది గల్లంతయ్యారు. ఇండోనేషియాలో భూకంపం, ఆ వెంటనే సునామీ రావడంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంది. పాలూ ప్రాంతంలో వచ్చిన సునామీ కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
సులవేసి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే.. పాలూ వద్ద సునామీ బీభత్సం సృష్టించింది. అలలు పది అడుగులు పైనే ఎగసి పడ్డాయయని... దీంతో తీర ప్రాంతం బాగా దెబ్బతిందని అధికారులు అంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వారు చెప్తున్నారు.